స్టైలిష్ లుక్ లో శ్రీలీల
Sreeleela in stylish look
సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో విజయం కోసం వెయిట్ చేస్తున్న క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ ని పక్కనపెట్టి తమిళనాట, అలాగే బాలీవుడ్ పై హోప్స్ పెట్టుకుంది. తమిళనాట అమ్మడుకి సక్సెస్ లేకపోయినా.. ఆమె వెంట కోలీవుడ్ హీరోలు, దర్శకులు పడుతూ శ్రీలీల కోసం కేరెక్టర్స్ సృష్టిస్తున్నారు.
మరోపక్క గత రెండేళ్లుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై నడుస్తున్న సస్పెన్స్ ఓ కొలిక్కి వచ్చింది. ఆమె కార్తీక్ ఆర్యన్ తో నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది విడుదల అని ప్రకటించేసారు. ఇప్పటివరకు కన్ఫ్యూజన్ లో ఉన్న శ్రీలీల బాలీవుడ్ లో నటించిన డెబ్యూ మూవీపై క్లారిటీ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ క్యూటీ పిక్స్ ఎప్పుడు వైరల్ అవుతాయి.
తాజాగా శ్రీలీల షేర్ చేసిన పిక్స్ చూస్తే స్టైలిష్ శ్రీలీల, వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చెయ్యాల్సిందే. బ్లాక్ టాప్, అమాయకమపు చూపులు, లూజ్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించింది. శ్రీలీల ఈ స్టైలిష్ లుక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
















































