రణబాలి ట్విట్టర్ టాక్

Ranabaali Twitter TalkRanabaali Twitter Talk


విజయ్ దేవరకొండ - రష్మిక  కలయికలో రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన రణబాలి చిత్రం నేడు అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో విజయ్ దేవరకొండ, రష్మిక లు భార్య భర్తలు కావడం, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి. రణబాలి ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో సినిమాపై తమ అభిప్రాయాన్ని ఆడియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. 1858 రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే రణబాలిగా విజయ్ దేవరకొండ లుక్స్, నటన లో పరిపక్వత, విజయ్ దేవరకొండ-రష్మికతో కెమిస్ట్రీ, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు.

ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండడం, సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు, నిడివి, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల ల్యాగ్ అవడం, నేపథ్య సంగీతం అన్ని రణబాలి లో మైనస్ అంటూ మరికొందరు ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బ్రిటిష్ కాలం నాటి సెటప్ అదిరిపోయాయి కానీ.. ఎమోషన్స్ పండకపోవడం, నెమ్మదిగా సాగే కథనం, భారీ రన్‌టైమ్‌ సినిమాని ఎఫెక్ట్ చేశాయంటూ ఇంకొందరు స్పందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ రణబాలి ప్రస్తుతం మిక్స్డ్ రెస్పాన్స్ ని రాబడుతుంది, అసలు ఓవరాల్ గా సినిమా ఎలా ఉందొ పూర్తి సమీక్ష మరికాసేపట్లో..!

Ranabaali Social Media Talk