జైలర్ 2 ప్రీమియర్ షో టాక్
Jailer 2 Premieres Talk
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ ని బ్యాక్ బౌన్స్ చేసిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చిత్రం రజినీ ని సూపర్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఇపుడు దానికి సీక్వెల్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన జైలర్ 2 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓవర్సీస్ లో జైలర్ 2 ప్రీమియర్స్ పూరి కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ జైలర్ 2 పై ట్వీట్లు వేస్తూ సందడి చేస్తున్నారు. జైలర్ 2 ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ కి మించి, ఫస్టాఫ్లో సూపర్ స్టార్ కూల్ ఇంట్రో, స్లో స్టార్ట్, లిటిల్ ఫన్, మాస్ ఇంటర్వెల్, ఓవరాల్ గా ఫస్టాఫ్ అదిరిపోయింది. డార్క్ హ్యుమర్ బాగా వర్కవుట్ అయింది. యోగిబాబు కామెడీ ట్రాక్ చాలా బాగుంది. రజనీకాంత్ ఫైర్ మోడ్లో పెర్ఫార్మెన్స్ చేశారు.. అంటూ కొంతమంది ఆడియన్స్ ట్వీట్ చేసారు.
దర్శకుడు నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో పాటు రజనీకాంత్కు కావాల్సిన ఎలివేషన్స్ ఇస్తూనే కథని నడిపించాడు, రజనీకాంత్ టైటిల్ కార్డ్, ఓపెనింగ్ సీన్ చూసి థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారంటూ మరికొంతమంది ప్రేక్షకులు చెబుతున్న మాట.
జైలర్ 2 కి అనిరుద్ రవిచంద్ర BGM నెక్స్ట్ లెవల్. స్టార్ కాస్టింగ్, క్రేజీ క్యామియోలు జైలర్ కి అదనపు ఆకర్షణ, కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఊపు సెకండ్ హాఫ్ లో లేదు, కథను సెటప్ చేయడానికి ప్రారంభంలో కాస్త సమయం తీసుకోవడం వల్ల కొన్నిచోట్ల పేసింగ్ నెమ్మదించింది. అంతేకాదు చాలాచోట్ల తేలిపోయిన కామెడీ సీన్స్ జైలర్ 2 కి మైనస్ అంటూ మరికొంతమంది ఆడియన్స్ చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ కేక, సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ డిజప్పాయింట్మెంట్ అంతేతప్ప జైలర్ 2 సూపర్ హిట్ అంటూ రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియాని నింపేస్తున్నారు.















































