BB10: షాలిని పొగరు దించేసి నాగార్జున
Bigg Boss 10: Nagarjuna Fires On Shalini
ఎప్పుడు సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ పై పడి ఏడుస్తున్న అగ్నిపరీక్ష టీమ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. గత వారం నామినేషన్స్ విషయం మాట్లాడొద్దు అని రాంప్రసాద్ కి చెప్పిన నాగ్ ఈ వారం అగ్నిపరీక్ష టీమ్ నామినేషన్స్ ని డిస్కర్స్ చేయడంపై ఫైర్ అయ్యారు.
షాలిని కన్ఫెషన్ రూమ్ కి రా అంటూనే.. నేను నామినేషన్స్ విషయాలు మాట్లాడొద్దు అన్నాక అందరూ మాట్లాడలేదు, కానీ మీ టీమ్ మొత్తం నామినేషన్స్ ముచ్చట తీసింది అని నాగ్ అడగగానే అవును సర్ అది కరెక్ట్ కాదు కానీ.. అనగానే కరెక్ట్ కాదు అంటున్నావ్ కానీ అంటున్నావ్, నువ్వే కదా నామినేషన్స్ లో వాళ్ళు గుంపుగా వస్తున్నారు అని అలిగేషన్ చేసావ్ అంటూ క్లాస్ పీకారు.
ఇక రాంప్రసాద్ అపూర్వ నిన్ను సరదాగా పెళ్లికొడుకుని చూడమంది అనుకోవచ్చుగా అనగానే.. సరదాగా కాదు సర్, సీరియస్ గా నామినేట్ చేస్తుంది అన్నాడు రామ్ ప్రసాద్. ఈలోపు షాలిని లేచి.. అపూర్వ హౌస్ లోకి వచ్చాక రోహిత్ నీది నాది పెయిర్ బావుంది, మనం అగ్నిపరీక్ష టీమ్ లో హిట్ పెయిర్ ఇక్కడ అలానే అంది, అది లవ్ ట్రాక్ సెట్ చేసుకోవడానికే కదా సర్ అంది షాలిని.
దానికి రోహిత్ ఫేస్ మాడిపోయింది, నీది షాలిని పెయిర్ బయట అంతగా ప్రొజెక్ట్ అవ్వలేదు అని చెప్పింది అంటూ అపూర్వపై చెప్పింది షాలిని. ఆతర్వాత అపూర్వని త్రిగున్ ఏడిపించడంపై నాగ్ త్రిగున్ కి క్లాస్ పీకిన ప్రోమో రిలీజ్ చేసారు.
















































