రణబాలి ట్రైలర్ ఇంపాక్ట్ ఎంత?
Vijay Devarakonda’s Ranabaali Trailer Gets Mixed Reactions
ఈ ఏడాది పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ-రష్మిక లు కలిసి నటించిన చిత్రం రణబాలి. ప్రేమికులుగా సీక్రెట్ డేటింగ్ చేసిన విజయ్ దేవరకొండ-రష్మిక లు పెళ్లి తర్వాత కలిసి నటించడం, ఆ చిత్ర ప్రమోషన్స్ లో క్రేజీగా కనిపించడం అన్ని సినిమాపై ఎంత క్రేజ్ పెంచాయి. అంతేకాదు.. రెండురోజుల క్రితం విడుదలైన రణబాలి ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
రణబాలి ట్రైలర్ సినిమాపై పెంచే క్రేజ్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం అయితే రణబాలి పై లో బజ్ కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ గత చిత్రాల ఎఫెక్ట్ రణబాలి పై స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో కావాలని ట్రోల్ చేస్తున్నారు, అలాంటి వాటికి భయపడను అంటున్న విజయ్ దేవరకొండ ప్యారడైజ్ పై నెగెటివ్ ట్రోల్స్ చూసి అయినా టెన్షన్ పడాల్సిందే అంటున్నారు నెటిజెన్స్.
విజయ్ దేవరకొండ క్రేజ్ రణబాలి ఓపెనింగ్స్ తో ప్రూవ్ చెయ్యాల్సిందే. రణబాలి ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నా కొంతమంది విజయ్ దేవరకొండ లాంగ్వేజ్ పై విమర్శలు చెయ్యడం.. ఇవన్నీ ఓపెనింగ్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడతాయా అనే అనుమానాలు చాలామందిలో కనిపిస్తున్నాయి.
















































