బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో నాని సినిమా క్యాన్సిల్
Nani Shelves a Crazy Film
ది ప్యారడైజ్ చిత్రం తర్వాత హీరో నాని సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియా చిత్రం చెయ్యాల్సి ఉంది. ఈ చిత్రం రేపో మాపో పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. సుజిత్ తర్వాత నాని చెయ్యబోయే లైనప్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. నాని వెంకీ అట్లూరి తో తదుపరి మూవీ చేయబోతున్నాడని అన్నారు.
లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి తో నాని సినిమా అనగానే అందరిలో ఈ కాంబో పై అంచనాలు మొదలయ్యాయి. అయితే తాజాగా నాని - వెంకీ అట్లూరి మూవీ క్యాన్సిల్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సుజిత్ తో చెయ్యబోయే బ్లడీ రోమియో తర్వాత నాని సత్యం శివం సుందరం ఫేం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తారని అంటున్నారు. ఇక నాని లైనప్ లో ఇరుముడి తో బ్లాక్ బస్టర్ కొట్టిన శివ నిర్వాణ కూడా ఉన్నారట. గతంలో శివ నిర్వాణ తో నాని సినిమా చేసిన విషయం తెలిసిందే.
















































