రణబాలి ట్రైలర్: విజయ్ దేవరకొండ విశ్వరూపం

Ranabaali Trailer ReleasedRanabaali Trailer Released


విజయ్ దేవరకొండ-రష్మిక కలయికలో రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి చిత్రం ఈ నెల 16న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా రణబాలి ట్రైలర్ ని ఈరోజు గురువారం రివీల్ చేసారు మేకర్స్. శింగనమల బొబ్బిలి రణబాలి గా విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించారు.

ఇక రణబాలి ట్రైలర్ లోకి వెళితే.. విజయ్ దేవరకొండ తన విశ్వరూపాన్ని చూపించారు. యాక్షన్ సీన్స్ లో ఆయన నటన, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. జయమ్మ గా రష్మిక మందన్న లుక్స్, ఆమె పాత్ర తీరు అన్ని ట్రైలర్ లో హైలెట్ అవుతున్నాయి. బ్రిటిష్ వారితో యుద్ధం చేసి రాయలసీమ ప్రాంతాన్ని దక్కించుకున్న తీరు ఈ ట్రైలర్ లో చూపించారు.

రాహుల్ సంక్రిత్యన్ మేకింగ్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, BGM అన్ని రణబాలి ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండ-రష్మిక ల స్క్రీన్ ప్రెజెన్స్ ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

Ranabaali Trailer out