కామ్రేడ్ కళ్యాణ్ ప్రీమియర్స్ టాక్
Comrade Kalyan Premieres Talk
దసరా హాలిడేస్ మొదలవుతున్న సమయంలో.. సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ వారం ముందుగా విడుదలైన చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. వెంకటేష్ ఆదర్శకుటుంబం వాయిదా పడడంతో కూల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు కామ్రేడ్ కళ్యాణ్. శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నేడు అక్టోబర్ 9 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత రాత్రే ప్రెస్ వాళ్లకు స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఈ చిత్ర ప్రీమియర్ టాక్ లోకి వెళితే..
నక్సలిజం నేపథ్యంలో కామెడీ ప్రాధాన్యంతో తెరకెక్కిన కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ కామెడీ తో ఆకట్టుకోగా.. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్- శ్రీకాంత్ అయ్యంగార్ కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ , శ్రీ విష్ణు తన పాత్రలో నవ్వించడమే కాదు.. ఆ పాత్రలో అలవోకగా ఒదిగిపోయాడు. సుదర్శన్, సత్య కామెడీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
కామెడీ, ట్విస్ట్ లు ప్రధాన బలాలుగా కామ్రేడ్ కళ్యాణ్ కి చెప్పుకుంటే.. లాజిక్ లేని సన్నివేశాలు, రియాలిటీకి దూరంగా ఉండే స్టోరీ, క్లైమాక్స్ అన్ని కామ్రేడ్ కళ్యాణ్ కి నెగెటివ్ పాయింట్స్ గా నిలుస్తాయి. కామ్రేడ్ కళ్యాణ్ ఫైనల్ రిపోర్ట్... పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..
















































