వర్రీ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
NTR fans are worried
యంగ్ ఎన్టీఆర్ ఈ నెలలోనే డ్రాగన్ సెట్ లోకి వెళ్ళబోతున్నారు. భుజానికి తగిలిన గాయం నుంచి కోలుకుంటూ ఫ్రెండ్స్ తో కలిసి విదేశీ ట్రిప్ వేసిన ఎన్టీఆర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. డ్రాగన్ చిత్రం వచ్చే ఏడాది జూన్ లో విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసారు.
త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రీ లుక్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే మూవీ విషయంలో వర్రీ అవుతున్నారు. కారణం ఆదర్శ కుటుంబం, ఆయన తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం పై ప్రస్తుతం ట్రేడ్ లో బజ్ లేకపోవడం, అలాగే సినిమాని వారం వారం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్లడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పోస్ట్ ప్రొడక్షన్ ని ఇలా డిలే చెయ్యడంతో నిర్మాతలకు నష్టమే. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా విడుదలకు అడుగు దూరంలో వాయిదా అంటే సినిమాపై, అలాగే దర్శకుడిపై ట్రోల్స్ వస్తాయి. సోషల్ మీడియాలో ఆదర్శకుటుంబం అలాగే త్రివిక్రమ్ పై ట్రోల్స్ చూసాకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగిపోతుంది.
















































