ఆదర్శం అంటూ గురూజీని కెలికిన పూనమ్
Poonam Kaur slams Guruji
మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వేసే ట్వీట్లు సినిమా ఇండస్ట్రీని, అలాగే మూవీ లవర్స్ ని ఆలోచనలో పడేస్తుంటాయి. అంతేకాదు పూనమ్ వేసే ట్వీట్లు కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. తాజాగా పూనమ్ కౌర్ మరో బాంబ్ పేల్చింది.
పూనమ్ కౌర్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్ ను డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యకుండా ఆయనను పాపులర్ చేసిన గురూజీ పేరు తో ట్వీట్లు వేస్తూ హడావిడి చేస్తుంది. తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం పేరుతొ పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఏమాత్రం ఆదర్శం లేని దర్శకుడు, 100 శాతం పబ్లిసిటీ చేసుకునే ఈ డైరెక్టర్ బారి నుంచి నటీనటులను, నిర్మాతలను దేవుడే కాపాడాలి. హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే ఇతను తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ వ్యక్తికి అసలు ఎలాంటి ఆదర్శం లేదు. కాబట్టి ఇతనికి దూరంగా ఉండండి. ఈ తాంత్రికుడు, నకిలీ గురువు నుంచి అమాయకులను ఆ దేవుడే కాపాడాలి అంటూ ఇన్స్టా లో పోస్ట్ పెట్టిన పూనమ్ కౌర్.. AK అనేది మరో నటుడి విషయంలో అజ్ఞాతవాసి లాంటిది.. అంతే అంటూ మరో పోస్ట్ వేసింది.
మరి ఆదర్శ కుటుంబాన్ని తెరకెక్కించింది త్రివిక్రమే కదా, వెంకీ కి AK 40 అజ్ఞాతవాసి లాంటిది అవుతుంది అని ఆమె వేసిన ట్వీట్ కి అర్థంలా చెబుతున్నారు నెటిజెన్స్.
















































