ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varun Tej makes interesting comments on the Mega legacy

మెగా లెగసీపై వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Varun Tej makes interesting comments on the Mega legacyVarun Tej makes interesting comments on the Mega legacy

సినిమా ఇండ‌స్ట్రీకి  బలమైన నేపథ్యం నుంచి వచ్చినప్పుడు లభించే గుర్తింపు ఎంత గొప్పగా ఉంటుందో? అదే సమయంలో ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే తీవ్రంగా ఉంటాయన్న‌ది కాద‌న‌లేని నిజం. మెగా కుటుంబం నుంచి పరిచయమై దశాబ్ద కాలానికి పైగా తనదైన శైలిలో సొంత ముద్ర వేసుకున్న హీరో వరుణ్ తేజ్ తాజాగా తన సినీ ప్రయాణం .. వారసత్వ బాధ్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దల పేరు ప్రఖ్యాతులు ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడతాయో? అంతకుమించి అదనపు బాధ్యతను, ఒత్తిడిని కూడా మోసుకొస్తాయని వ‌రుణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

పెద్ద కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన విజయం సులువుగా లభించదని, వారి పేరు వెనుక ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ , అంకితభావం  ఉంటాయని  స్పష్టం చేశారు. ఆ కష్టంతో నిర్మితమైన వారసత్వాన్ని కాపాడుకోవడం అనేది  పెద్ద సవాలు అని  అభిప్రాయపడ్డారు. పెద్దలు సాధించిన విజయాలు ప్రామాణికంగా మారినప్పుడు వారి స్థాయిలో రాణించాలనే ఒత్తిడి ప్రతి సినిమాతోనూ సహజంగానే ఉంటుందని, అయితే దానిని సానుకూల కోణంలో తీసుకుని ముందుకు సాగడమే ఏకైక మార్గమన్నారు.

సినీ ప్రయాణం ప్రారంభంలో మెగా కుటుంబం అనే ట్యాగ్ తెచ్చే అంచనాల పట్ల తాను చాలా జాగ్రత్తగా, ప్రతి విషయంలోనూ ఎంతో అప్రమత్తంగా ఉండేవాడినని వరుణ్ గుర్తు చేసుకున్నారు.  ఒక నటుడిగానే కాకుండా తమ కుటుంబాన్ని,  పెద్ద లెగసీని ప్రతిబింబిస్తున్నామనే భావన ప్రతి క్షణం ఉండేదని వివరించారు. మాటతీరు నుంచి ప్రవర్తన వరకు, ఎంచుకునే పాత్రల నుండి పనిచేసే తీరు వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకమైన నిబద్ధత అవసరమని కాలక్రమేణా అర్థమైందన్నారు.

వారసత్వం అనేది ప్రాథమికంగా అవకాశాలను తెచ్చిపెట్టినా? ప్రేక్షకులలో నిలదొక్కుకోవడానికి నటుడిగా సొంత సామర్థ్యం తప్పనిసరి. పెద్దల కీర్తిపై ఆధారపడకుండా, కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ తనదైన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. తనకంటూ ప్రత్యేకమైన శైలిని నిర్మిం చుకుంటూనే, కుటుం బం నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగ‌డ‌మే త‌న ముదున్న ఛాలెంజ్ అన్నారు.
 

Varun Tej