సూపర్ స్టార్ ధర్మన్ లోకి శ్రీలీల ఎంట్రీ
Sreeleela joins Rajinikanth's Dharman
టాలీవుడ్ లో ఆల్మోస్ట్ గేట్లు మూసుకుపోతున్న తరుణంలో క్యూట్ బ్యూటీ శ్రీలీల కు తమిళనాట మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అక్కడ వరస ప్రాజెక్ట్స్ తో శ్రీలీల బిజీ అయ్యింది. ధనుష్ తో నటిస్తున్న ఓం చిత్రం విడుదల కావాల్సి ఉంది. అంతలోనే ఆమెకు సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ లో నటించే ఛాన్స్ తగిలింది.
ఈ చిత్రంలో మరో హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తుంది. అంతేకాదు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కీ రోల్ ప్లే చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈచిత్రంలోకి శ్రీలీల ఎంటర్ కాబోతుంది. శ్రీలీల రజినీకాంత్ కుమార్తెగా కనిపిస్తుంది అని, రామ్ కి వైఫ్ గా కీ రోల్ ప్లే చేస్తుంది అనే ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం మైసూర్ లో ధర్మన్ సినిమా షూటింగ్ జరుగుతున్న లోకేష్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో శ్రీలీల ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించడంతో ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుంది విషయం దాదాపు ఖరారైంది. నిన్న రాశి ఖన్నా రామ్ పోతినేని ధర్మన్ లో నటిస్తున్నట్లుగా పిక్ తో కన్ ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
















































