BB10: హౌస్ మేట్స్ తో కెప్టెన్ అపూర్వ రచ్చ
Bigg Boss 10: Captain Apoorva's heated clash with housemates
ఆదివారం ఎపిసోడ్ లో ముఖేష్ గౌడ్ కెప్టెన్సీ వదులుకోవడంతో వర్షిణి ఇంకా వంశి ఎలిమినేషన్ లోకి వెళ్లకుండా సేఫ్ గా ఇంట్లోకి వచ్చేసారు. ముఖేష్ గౌడ్ కి కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అపూర్వ ని నాగార్జున కెప్టెన్ ని చేసారు. దానితో అపూర్వ హౌస్ లో తన పవర్ చూపించడం స్టార్ట్ చేసింది.
ముఖేష్ గౌడ్ ఇమ్మిడియట్ గా కెప్టెన్ రూమ్ ఖాళీ చెయ్యాలి అని, అలాగే 3 టైమ్స్ డిష్ వాష్ చెయ్యాలని చెప్పడంతో ముఖేష్ గౌడ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు యాటిట్యూడ్ తో చెబితే నేను చెయ్యను అన్నాడు, మరి నువ్వు అలాగే చెప్పావ్ అని అపూర్వ అంటే అది నా స్టయిల్ అన్నాడు, ఇది నా స్టయిల్ అంటూనే నేను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నువ్వు నన్ను ఇలా అన్నావ్ అంటూ అపూర్వ ప్రోవో కింగ్ చేసింది.
ఆతర్వాత నన్ను కెప్టెన్ అపూర్వ అని పిలవాలి అంటూ ఆర్డర్ వేసింది. దానికి నేను ఒప్పుకోను అపూర్వ అంటూ త్రిగుణ ఆమెతో గోడవ పెట్టుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ వైల్డ్ గా హౌస్ మేట్స్ ప్రవర్తించడం ఈరోజు వదిలిన ప్రోమోలో హైలెట్ అయ్యింది.
















































