వశిష్టతో మోక్షు సినిమాకి బాలయ్య సూచనలు
Balakrishna reworking on Mokshagna script
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి రంగం సిద్దమైంది. బాలయ్య చాలా అలోచించి మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ గా బింబిసార ఫేమ్ వశిష్ట ను తీసుకొచ్చారు. వసిష్ఠ మోక్షజ్ఞ సినిమా లైన్ చెప్పి బాలయ్య ను ఇంప్రెస్స్ చెయ్యడంతో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది.
మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ని దర్శకుడు వశిష్ట భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, భారీ విఎఫ్ఎక్స్ వంటి అంశాలతో రూపొందించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా స్క్రిప్ట్ విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ప్రస్తుతం మోకాలి గాయంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య వశిష్ట ను పిలిపించుకుని పూర్తి స్క్రిప్ట్ విన్నారట. స్క్రిప్ట్ విన్న బాలయ్య ఫస్ట్ హాఫ్ పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చెయ్యగా.. సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు సూచించారని సమాచారం. దానికి అనుగుణంగా దర్శకుడు వశిష్ట సెకండ్ హాఫ్ లో మార్పులు చేసి మరోసారి బాలయ్యను కలిసి ఓకే చేయించుకుని మోక్షు మూవీ ని స్టార్ట్ చేస్తారని ఈలోపు ఆయన తన దగ్గర ఉన్న విశ్వంభర ను విడుదల చేసుకునేలా వశిష్ట ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తుంది.
















































