ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli reacts to project with Suriya

సూర్యతో రాజమౌళి మూవీ చాలా స్పెషల్

Rajamouli reacts to project with Suriya Rajamouli reacts to project with Suriya

 

ఎస్ ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ మూవీ కి ఏ హీరో ని చూజ్ చేసుకుంటారా అనే క్యూరియాసిటీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోలకే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ లో కూడా చాలా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో వారణాసి చేస్తున్న రాజమౌళి తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తారనే విషయంలో చాలామంది లో చాలా ఆత్రుత ఉంది.

అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో రాజమౌళి సినిమా ఎపుడు అని చెన్నై మీడియా అడిగింది. దానికి రాజమౌళి కర్ర విరగకుండా, పాము చావకుండా సమాధానమిచ్చారు. అంటే సినిమా ఉంటుంది అని, కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేకుండా చెప్పారు. గత రాత్రి చెన్నై లో రాజమౌళి కొడుకు కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించిన ఫాహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ప్రెస్ మీట్ జరిగింది.

అక్కడ రాజమౌళికి సూర్య తో మూవీ అనే ప్రశ్న ఎదురైంది. దానికి రాజమౌళి నేను సూర్య‌తో సినిమా ఎప్పుడో చెబితే అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యి హెడ్‌లైన్ అయిపోతుంద‌ని, దానితో ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న డోంట్ ట్ర‌బుల్ ద ట్రబుల్ సినిమా ఫోక‌స్ నుంచి ప‌క్క‌కు వెళ్లిపోతుంద‌ని, కాబ‌ట్టి సూర్య సినిమాపై ఏమి మాట్లాడలేను.

కానీ తాను, సూర్య ఎప్పుడు క‌లిసి సినిమా చేసినా అది చాలా స్పెషల్‌గా ఉంటుంద‌ని అంటూ ఆయన సూర్య చిత్రం పై హైప్ పెంచి వదిలిపెట్టారు.

Rajamouli on project with Suriya