ది ప్యారడైజ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

The Paradise 1st weekend collectionsThe Paradise 1st weekend collections


నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ చిత్రం గత గురువారం విడుదలైంది. మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తో మొదలైన ది ప్యారడైజ్ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో మాత్రం నాని కెరీర్ కే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది. మొదటి రోజు ప్యారడైజ్ చిత్రం రూ.80 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది.

ఆతర్వాత కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడంతో డివైడ్ టాక్ తోనే ప్యారడైజ్ చిత్రం మొదటి వీకెండ్ గడిచేసరికి రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అంటే చాలా ఏరియాల్లో ది ప్యారడైజ్ చిత్రం 80 శాతం రికవరీ అయినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అటు హిందీలోనూ ప్యారడైజ్ చిత్రం రూ.7 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్యారడైజ్ చిత్రం మొదటి వీకెండ్ కలెక్షన్స్ పోస్టర్ ని అఫీషియల్ గా వదిలారు. ఇక ఈ వారం పూర్తయ్యే సమయానికి పారడైజ్ బయ్యర్లు చాలా వరకు సేవ్ అవుతారని తెలుస్తుంది. సోమవారం ప్యారడైజ్ అక్యుపెన్సీని బట్టి మేకర్స్ మొదటి వారంలో బయటపడిపోతారా, లేదా అనేది తెలుస్తుంది. 
 

The Paradise first weekend collections