ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Sirish Complains About Loud Music

సౌండ్ పొల్యూషన్ అంటూ మెగా హీరో ఫిర్యాదు

Allu Sirish Complains About Loud MusicAllu Sirish Complains About Loud Music

 


హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. గత 15 రోజులుగా గణేష్ లను ప్రతిష్టించి మండపాల దగ్గర మైక్స్ పెట్టి గణేశుడు పాటలు ప్లే చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మహానగరంలో గణేష్ మండపాల దగ్గర మైక్ సెట్స్ జాతర అంతగా వినిపించలేదు.

అయితే అర్ధరాత్రులు మైకులు పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ మెగా హీరో అల్లు శిరీష్ హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. షేక్‌పేట్ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభా నగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తోంది. ప్రతి రోజు రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తున్నారు.

అయితే గతంలో ఈ విషయమై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా.. గణేశ్ నిమజ్జనం వరకు సర్దుకుపోవాలని పోలీసులు చెప్పారు.. ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు పూర్తయినా ఆ లౌడ్ స్పీకర్లు ఆగడం లేదు అని అల్లు శిరీష్ పోలీసులకు కంప్లైట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది.
 

Allu Sirish Raises Noise Complaint