ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Zeenat Aman on Labels for Women in 1980s Bollywood

నాటి పరిమితుల నుండి నేటి ఆధిపత్యం వరకు!

Zeenat Aman on Labels for Women in 1980s BollywoodZeenat Aman on Labels for Women in 1980s Bollywood

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ చలనచిత్ర పరిశ్రమలో మహిళల స్థానం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు కాలక్రమేణా వచ్చిన మార్పులపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 1970- 80ల నాటి పరిస్థితులతో పోలిస్తే నేటి బాలీవుడ్‌లో మహిళల పోరాటం సరికొత్త రూపాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు. తన కాలంలో నటీమణులకు ఎక్కువగా గ్లామరస్ లేదా పరిమితమైన ప్రాధాన్యత కలిగిన పాత్రలే లభించేవని, కానీ నేటి కాలంలో మహిళలు కథానాయకులుగా, కథను నడిపించే ప్రధాన శక్తులుగా విభిన్నమైన పాత్రలలో సత్తా చాటుకుంటున్నారు.

పరిశ్రమలో పెరిగిన అవకాశాలు , ఆర్థిక స్వాతంత్ర్ గురించి మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు నటనకే పరిమితం కాకుండా నిర్మాణం, దర్శకత్వం , రైటింగ్ వంటి పలు విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని జీనత్  తెలిపారు. అలాగే వేతన వ్యత్యాసం పై బహిరంగంగా మాట్లాడటం, సమాన వేతనం ,  సురక్షితమైన పని వాతావరణం కోసం గళమెత్తడం నేటి కాలంలో పెరిగిన మార్పుకు సంకేతమని  అభిప్రాయపడ్డారు. ఈ రకమైన చైతన్యం మహిళలను పరిశ్రమలో మరింత స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో నిలబెడుతోందన్నారు.

నేటి తరం నటీమణుల ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తూనే ఇంకా అధిగమించాల్సిన సవాళ్లు కొన్ని మిగిలే ఉన్నాయని  గుర్తుచేశారు. డిజిటల్ మాధ్యమాలు, ఓటీటీల రాకతో వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ నటీమణులకు సైతం బలమైన పాత్రలు లభిస్తుండటం సంతోషకరమైన పరిణామమని తెలిపారు. ఎంతటి పోటీ ఉన్నప్పటికీ ప్రతిభను నమ్ముకుని తమకంటూ  ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి ఆధునిక హిందీ సినిమా మహిళలకు మెరుగైన వేదికగా మారుతోందని జీనత్ అమన్ స్పష్టం చేశారు.

 

Zeenat Aman