ఆ బ్లాక్ బస్టర్ ని మిస్ అవుతున్న తెలుగోళ్లు

Hanuman Ansh Telugu release shelvedHanuman Ansh Telugu release shelved


హిందీలో ఎలాంటి అంచనాలు, మరెలాంటి హైప్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ అంశ్ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిందీలో బ్లాక్ బస్టర్ ధురంధర్ రికార్డ్ లనే చెరిపేసి మూవీగా హనుమాన్ అంశ్ చరిత్రకెక్కింది. ఇప్పటికి థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది.

47 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ అంశ్ చిత్రం రేపు రూ.360 కోట్ల గ్రాస్ తో పెద్ద హిట్ గా నిలిచింది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హనుమాన్ అంశ్ ఇప్పుడు అన్ని రికార్డులను తిరగరాసి అతి పెద్ద హిట్టు గా ఉద్భవించింది. అయితే ఈ చిత్రాన్ని గత వారం తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారని అన్నారు.

కానీ హనుమాన్ అంశ్ ని తెలుగులో విడుదల చేసే విషయంలో వెనక్కి వెయ్యడంతో ఆ సినిమా తెలుగు రిలీజ్ ఆగిపోయింది. దానితో హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ అంశ్ ను మన తెలుగోళ్లు మాత్రం మిస్ అవుతున్నారు. మరి ఇకపై హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ లేనట్లే అనే మాట గట్టిగానే వినిపిస్తుంది. 

Hanuman Ansh Telugu release faces uncertainty