దేవరకొండ స్పీడు కి ఫ్యాన్స్ షాక్
No Breaks for Vijay Deverakonda
విజయ్ దేవరకొండ రణబాలి చిత్రాన్ని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు కష్టపడుతున్నాడు. హీరోయిన్ రష్మిక ఇంజ్యురి వలన షూటింగ్ కాస్త ఆలస్యం అవడంతో సినిమాని అక్టోబర్ 16 దసరా కి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రీసెంట్ గానే రష్మిక సెట్ లోకి రావడం ఆమె మిగతా షూటింగ్ పూర్తి చేసి వెళ్ళిపోయింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ కుడా రణబాలి షూటింగ్ పూర్తి చేసేసాడు. అంతేకాదు అంతే స్పీడులో విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. రౌడీ జనార్ధన కొత్త షెడ్యూల్ ని మంగుళూరు లో మొదలు పెట్టారు.
బ్రేక్ లేకుండా వరుసగా రెండు భారీ సినిమాలను పూర్తి చేసే పనిలో విజయ్ దేవరకొండ ఉన్నాడు.. మంగళూరులో రౌడీ జనార్ధన లోని కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్ పూర్తి కాగానే విజయ్ దేవరకొండ ఇమ్మిడియట్ గా రణబాలి ప్రమోషన్స్ కోసం భార్య రశ్మికతో కలిసి మీడియా ముందుకు రాబోతున్నాడు.
















































