ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nani to skip RTC X Roads visit for The Paradise premiers

నాని కి షాకిచ్చిన తెలంగాణ పోలీసులు

Nani to skip RTC X Roads visit for The Paradise premiersNani to skip RTC X Roads visit for The Paradise premiers

 


ఈరోజు సెప్టెంబర్ 23 రాత్రి ప్యారడైజ్ ప్రీమియర్ ని హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి చూసేందుకు అనుమతి కోరుతూ నాని సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేస్తె.. దానికి సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి అధికారులతో చర్చించి చెబుతామన్నారు.

కానీ రేపు గణేష్ నిమజ్జనాల దృశ్య నాని అభిమానులతో కలిసి సినిమాని వీక్షిస్తుంటే తాము భద్రతా కల్పించలేమని, అభిమానులను, క్రౌడ్ ని హ్యాండిల్ చెయ్యడం ఇబ్బంది అవుతుంది అంటూ నాని విన్నపాన్ని తెలంగాణ పోలీసులు తిరస్కరించారు. సంధ్య థియేటర్ చాలా రద్దీగా ఉన్న ప్రాంతం కావడం, వినాయక నిమజ్జనాలకు పోలీసులు కూడా ఎక్కువశాతం బందోబస్త్ ఏర్పాటు చెయ్యడానికి వెళ్ళిపోతారు.

అందుకే నాని వస్తే సంధ్య థియేటర్ చుట్టుపక్కల క్రౌడ్ పెరుగుతుంది, సో తాము భద్రతా కల్పించలేము అన్న కారణంతో నాని అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతిని నిరాకరించారు. ఈ విధంగా నానికి తెలంగాణ పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు.

Will Nani grace RTC X Roads for The Paradise premiers