ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu Season 10 among the top 10 shows

టాప్ 10 షోస్ లో బిగ్ బాస్ సీజన్ 10

Bigg Boss Telugu Season 10 among the top 10 showsBigg Boss Telugu Season 10 among the top 10 shows

 

 

Endemol Shine India , Banijay Asia కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్న మన బిగ్ బాస్ 10 షో రోజు రోజు కి  జోరు అందుకుంటోంది. ఈ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో పాటు, సోషల్ మీడియా లో కూడా షో కి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది.
తాజా Ormax OTT వారి ప్రకారం, సెప్టెంబర్ 7–13 th మధ్యలో 43 లక్షల మంది వీక్షకులతో, బిగ్ బాస్ 10 షో భారత్లో top 10 రియాలిటీ షోస్ లో చోటు దక్కించుకొని  6వ స్థానానికి చేరుకుంది.

ఈ సీజన్ రోజు  రోజుకి  ఇంట్రెస్టింగ్ గా మారుతోంది . ప్రేక్షకులు, కంటెస్టెంట్లు ఇద్దరూ ఆశ్చర్యపోయేలా, ఆటను మరింత ఉత్కంఠభరితంగా ఉంచేలా మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. మారుతున్న పవర్ డైనమిక్స్ , హై-ఇంటెన్సిటీ టాస్క్ లను  ప్రవేశపెడుతున్నారు.

ఈ సీజన్ లో గేమ్ మారుతోంది సీన్ మారుతోంది.
Bigg Boss Telugu 10లో ఎప్పటికప్పుడు గేమ్ డైనమిక్స్ మారుతూ గేమ్ రూపాంతరం చెందుతోంది. హౌస్లో మొదటి లో  ఏర్పడిన ఆధిపత్యం అలాగే కొనసాగకుండా,  ఎప్పటికప్పుడు మారుతూ కంటెస్టెంట్ల స్థానాలను సవాలు చేస్తూ సీజన్ ని సరికొత్తగా ఉంచుతున్నాయి.

తొలి వారంలోనే  జరిగిన ఇన్సిడెంట్స్ తో షోకు మంచి ఊపు వచ్చింది. మిడ్-వీక్ ఎలిమినేషన్, హై ఇచ్చే టాస్క్ లు, అలాగే హౌస్ మేట్స్ తమ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు కంటెస్టెంట్లు పోటీపడటం గేమ్ పై ఆసక్తిని పెంచాయి.

గేమ్ మొదట్లోనే త్రిగుణ్, శాలిని, దేబ్జాని టాస్క్ ల ద్వారా హౌస్మేట్ గా మారడం, ఆసక్తి ని పెంచింది. అలా రోజురోజుకి మారుతున్న ఈ పవర్ గేమ్ లో బిగ్ బాస్ ఇల్లు చదరంగం లా మారింది. కొందరు కలిసి టీమ్ అయ్యారు, కొందరు టీమ్స్ కి దూరం అయ్యారు, కొందరు కలిసి గేమ్ ఆడితే, మరికొందరు విడి విడి గా గేమ్ ఆడుతున్నారు .

అగ్ని పరీక్ష నుంచి ‘పవర్ ఆఫ్ పీపుల్’.. ఇదే అసలైన ట్విస్ట్!

కంటెస్టెంట్లు గేమ్ లో మరింతగా సెట్ అవుతున్న కొద్దీ.. వాళ్ల మధ్య రిలేషన్షిప్స్ స్టార్ట్ అయ్యి గ్రూపులు, గొడవలు కూడా ఈ సీజన్లో ఇంపార్టెంట్ అంశాలుగా మారుతున్నాయి.

గ్రూపిజం, ఫేవరిటిజం, టాస్క్ విషయంలో తీసుకునే నిర్ణయాలు, హౌస్ బాధ్యతలపై differences ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో రోహిత్, త్రిగుణ్ మధ్య జరుగుతున్న గొడవలు కూడా తరచూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
అయితే గొడవలతో పాటు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఈ సీజన్లో మంచి స్పేస్ దొరుకుతోంది. టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య జరిగే కన్వర్జేషన్స్ .. హౌస్లోని కాంపిటేషన్ ని మరింత టఫ్ చేస్తున్నాయి .

ఇలా పోటీలు , గొడవలు, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, స్ట్రాటజీలన్నీ కలగలిసి.. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆడియన్స్ ఫాలో అవ్వడానికి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాయి.

సోషల్ మీడియా లో పెరుగుతున్న బజ్
బిగ్ బాస్ సీజన్ 10పై రోజురోజుకీ ఇంట్రెస్ట్ పెరుగుతుండటం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో క్లియర్ గా కనిపిస్తోంది. స్టార్ మా రిలీజ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కి ఆన్లైన్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమోల్లో కొన్ని ఇప్పటికే మిలియన్ వ్యూస్ మార్క్ దాటాయి. మరికొన్ని ప్రోమోలు అయితే అంతకంటే ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.

అయితే ప్రోమోలకు వచ్చే వ్యూస్, ఓటీటీ ఆడియన్స్ కొలిచే మెట్రిక్స్ రెండూ వేరే కాబట్టి.. వాటిని డైరెక్ట్ గా పోల్చకూడదు అయినా షోకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్. ఈ సీజన్ పై పెరుగుతున్న డిబేట్స్ , క్యూరియాసిటీని పెంచుతున్నాయి .

సీజన్ క్రమంగా ఊపందుకుంటున్న జోరు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభమైన తొలినాళ్లలోనే  ఆర్మాక్స్ ర్యాంకింగ్ రావడం ఇంట్రెస్టింగ్. రెండో వారంలో ఫార్మాట్ లో ఒక మార్పు . ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కొత్త కాన్సెప్ట్.  దాని వలన షో కి మరో కొత్త అంగెల్ .. దీంతో గేమ్ వేరే లెవెల్ కి వెళ్లింది .

ఈ కొత్త ఫార్మాట్ లో చూసే ఆడియన్స్ కి గేమ్ ని తిప్పే అవకాశం దక్కింది. ఆడియన్స్ కేవలం ఓటింగ్ చెయ్యడం కి పరిమితం కాదు అని తలుచుకుంటే ఏదైనా చేయచ్చు అని పవర్ ఆఫ్ పీపుల్ కాన్సెప్ట్ రుజువు చేసింది.

వీకెండ్ కి మన కింగ్ నాగార్జున గారు తనదైన స్టైల్ లో ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దెబ్బకి ఇంట్లో కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయాయి.

బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షో లో ప్రేక్షకుల అభిప్రాయం కి పెద్ద పీట వెయ్యడం తో అది ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది. చూసే ఆడియన్ ని కట్టిపడేదానికి ఇది ఒక ఎక్స్ట్రా లాయర్ లా , కాటలీస్ట్ లా పని చేసింది. గేమ్ లోఆడే కంటెస్టెంట్స్ తీసుకునే డిసిసైన్స్ పై  చూసే ఆడియన్స్ ప్రభావం చూపించడం అద్భుతం.

ఈ పవర్ ఆఫ్ పీపుల్ , నామినేషన్స్ పైనే కాక మిగిలిన అంశాల్లో కూడా క్లియర్ గా ప్రభావం చూపిస్తోంది. వాళ్ల మధ్య కాంపిటేషన్ కి ఆడియన్స్ వ్యూ ఆడ్ అవడం తో గేమ్ లో ఒక ఎక్స్ట్రా లాయర్ add అయ్యి గేమ్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది.

వీకెండ్ షురు .. నాగార్జున హుషారు !

నాగార్జున గారు అతని వీకెండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ, ఈ వీకెండ్ బిగ్బాస్ చరిత్ర లో చాలా సరికొత్త చాప్టర్ అని , “బిగ్బాస్ తెలుగు” చూసే ప్రేక్షకులకి ఈ వీక్ జరిగిన మేజర్ డెవలప్మెంట్ , కంటెస్టెంట్స్ తో ఇంట్రాక్షన్, సరికొత్త ట్విస్ట్ లు ఫుల్ కిక్ ఇస్తున్నాయి అని తెలిపారు. వీక్ మొత్తం లో జరిగే కీలక మైన మోమెంట్స్ మళ్లీ రీ విజిట్ చేసి ఆడబోయే గేమ్ ని మరింత అద్భుతం గా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

నిజానికి ప్రతి వీక్ కి ఫార్మాట్ ఏవోల్వ్ అవడం తో నాగార్జున గారు బాధ్యత కూడా హోస్టింగ్ తో ఆగట్లేదు, పెరుగుతూనే ఉంది. గేమ్ పవర్ స్ట్రక్చర్ కి కోతగా వచ్చే డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత్ కూడా తీసుకుంటున్నారు.

ఒకే హౌస్.. ఎన్నో కథలు!

ఇలా ఇంట్లో విషయానికి వస్తే , జరిగే ప్రతి సంఘటన కొత్త కథ ని తెర పైకి తెస్తోంది. తెర పైకి వచ్చే ప్రతికథ కి కంటెస్టెంట్స్ కేరెక్టరైజేషన్ unlock అవుతూ వస్తోంది.

సెప్టెంబర్ 7–13 మధ్య షో ఇండియన్ రియాలిటీ షోస్ టాప్ 10 లో 6th పొజిషన్ లో నిలవడంతో పాటు 43 లక్షల మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. ప్రారంభంలో కాస్త స్లోగా మొదలైనప్పటికీ.. ఇప్పుడు షోపై ఆడియన్స్ లో ఆసక్తి క్రమంగా పెరుగుతున్నట్లు ఈ రిపోర్ట్ ప్రూవ్ చేసింది.

కొత్త ఫార్మాట్, ఊహించని ట్విస్టులు, కంటెస్టెంట్ల మధ్య రైవల్రీస్, మారుతున్న రిలేషన్షిప్స్, ఆడియన్స్ పార్టిసిపేషన్.. ఇలా అన్నీ కలిసి సీజన్ కు మంచి ఊపు తీసుకొస్తున్నాయి.

బిగ్ బాస్ 10ను రూపొందిస్తున్న EndemolShine India, Banijay Asia ఈ రియాలిటీ ఫార్మాట్ కొత్త కొత్త లేయర్స్ యాడ్ చేస్తున్నారు . గేమ్ ఎలా సాగుతుందో అని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు . ఈ సారి ఈ viewership గేమ్ పై భారీ రేంజ్ న ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది.

కొత్త పవర్స్, నామినేషన్స్, టాస్కులు, మారుతున్న అలయన్స్ లతో హౌస్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్న నేపథ్యంలో.. రాబోయే వారాల్లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

బిగ్ బాస్ ని బిగ్పిక్చర్ లో చూస్తే..
ప్రస్తుతం బిగ్ బాస్ 10 గేమ్ ని చూస్తే.. సీజన్  ప్రారంభ దశ నుంచి ఊహించలేని మలుపులతో  సాలిడ్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది.
హౌస్లో పవర్ ఎప్పుడైనా మారొచ్చు. ఆడియన్స్ పార్టిసిపేషన్ కూడా కంటెస్టెంట్ల మధ్య డైనమిక్స్ పై ఎఫెక్ట్ చూపొచ్చు. అలాగే ఒక్కో టాస్క్తో ఒక్కో రిలేషన్షిప్ మారిపోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు.. షోపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని పెంచుతూ ఉంది.
ప్రారంభంలో కాస్త సైలెంట్ గా మొదలైనప్పటికీ.. ప్రస్తుతం ఇండియాలోని టాప్ 10 ఓటీటీ షోస్ లో 6వ స్థానంలో నిలిచినట్లు వచ్చిన రిపోర్ట్ తో బిగ్ బాస్ తెలుగు 10 క్రమంగా ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది.

EndemolShine India, Banijay Asia ప్రొడక్షన్ , ఫార్మాట్ను ముందుకు తీసుకెళ్తుండగా.. వీకెండ్ ఎపిసోడ్స్ ని నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఆడియన్స్ పార్టిసిపేషన్ కూడా గేమ్ లో ఇంపాక్ట్ చూపిస్తోంది. దీంతో స్ట్రాటజీ, ఎంటర్టైన్మెంట్, కంటెస్టెంట్ల పర్సనాలిటీస్, ఊహించని పరిణామాలు అన్నీ కలిసి.. సీజన్ చర్చను మరింత పెంచుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ మాలో ప్రసారం అవుతుండగా.. JioHotstarలో స్ట్రీమ్ అవుతోంది.

Bigg Boss Season 10