ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu completes Varanasi Shooting

వార‌ణాసి షూట్ ఫినిష్ చేసిన మహేష్

Mahesh Babu completes Varanasi ShootingMahesh Babu completes Varanasi Shooting

 

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఇప్పటికే 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్సులు, విజువల్ ప్రాధాన్యత ఉన్న కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా విజయవంతంగా ముగిసింది.

ప్రస్తుతం 10 శాతం టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్‌లో ఉండగా దాన్ని కూడా అక్టోబర్ నాటికి పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికతో ఉంది. సూపర్ స్టార్ మహేష్ తన పార్ట్ షూట్ ని ఫినిష్ చేసేసారు. దర్శకుడు ప్రతిపాదిస్తున్న షెడ్యూల్ ప్రకారం మిగిలిన కొద్దిపాటి సన్నివేశాలను అక్టోబర్ నెలఖరు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్‌లోనే టాకీ పార్ట్‌ ముగిస్తే చిత్రీకరణ మొత్తానికి గుమ్మడికాయ కొట్టేయడానికి ప్రొడక్షన్ టీమ్ సర్వం సిద్ధం చేస్తోంది.

షూటింగ్ పూర్తయిన వెంటనే చిత్ర బృందం పూర్తిస్థాయిలో వీఎఫ్ఎక్స్ , రీ-రికార్డింగ్ మరియు డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది. భారీ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ పనులు అత్యంత కీలకం కానున్నాయి. అక్టోబర్‌లోనే షూటింగ్ చివరి దశకు చేరుతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  చిత్రం ప్రమోషన్లు , విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Mahesh Babu completes his entire shooting schedule for Varanasi