ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Mukesh’s Temptation Leaves Debjani in Tears

బిగ్ బాస్ 10: దేబ్జానీ ని ఏడిపించిన ముఖేష్

Bigg Boss 10: Mukesh’s Temptation Leaves Debjani in TearsBigg Boss 10: Mukesh’s Temptation Leaves Debjani in Tears

 

బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ స్క్రీన్ స్పేస్ కోసం చాలా కష్టపడుతున్నారు. అనవసర విషయాలతో హైలెట్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు. బెంగాల్ నటి దేబ్జానీ అమాయకంగా కనిపిస్తూ అందరి మనసులను దోచేస్తుంది. నామినేషన్స్ లో నువ్వు మాస్క్ వేసుకున్నావ్ అంటూ త్రిగుణ ఆమెను ఎక్స్పోజ్ చేసాడు.

ఇక ముఖేష్ గౌడ్ కి స్టార్ ఆఫ్ ది ప్లేయర్ రావడంపై కామానర్స్ లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. ముఖేష్ కి టెంప్టేషన్ ఇంకా టెన్షన్ అంటూ బిగ్ బాస్ టాస్క్ లు పెట్టాడు. అలాగే బజర్ ముందు ప్రెస్ చేసిన వారికి పోటీ పెట్టగా ఇంటి లోపల బజర్ ప్రెస్ చేసిన ముఖేష్ గౌడ్ కి, బయట ప్రెస్ చేసిన రోహిత్ కి నడుమ టాస్క్ పడింది. అందులో ముఖేష్ గౌడ్ గెలిచాడు.

కెప్టెన్సీ కంటెండర్ గా ముఖేష్ గౌడ్ ని అనౌన్స్ చేసాడు బిగ్ బాస్. అయితే ముఖేష్ గౌడ్ కి టెంప్టేషన్ అలాగే టెన్షన్ అంటూ ఇచ్చిన టాస్క్ లో దేబ్జానీ, ఇంకా వర్షిణి లలో ఎవరో ఒకరు పేరెంట్స్ లెటర్ కోల్పోవాల్సి వస్తుంది. ఆమె కంటెండర్ టాస్క్ కూడా  కోల్పోవల్సి వస్తుంది. దాని కోసం వర్షిణిని వదిలేసి దేబ్జానీ కి టెన్షన్ ఇచ్చాడు ముఖేష్ గౌడ్.

దేబ్జానీ పేరెంట్స్ లెటర్ ని ముఖేష్ గౌడ్ కట్ చెయ్యగా దేబ్జానీ విపరీతంగా ఏడ్చేసింది. దేబ్జానీ ని అందరూ ఓదార్చారు. ముఖేష్ సారీ చెప్పినా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. 

Boss Telugu 10 Mukesh Leaves Debjani Heartbroken