ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Atlee is just a step away from Rajamouli!

రాజ‌మౌళికి అడుగు దూరంలో అట్లీ!

Atlee is just a step away from Rajamouli!Atlee is just a step away from Rajamouli!

భారతీయ చిత్ర పరిశ్రమలో మాస్, విజువల్ ఎంటర్‌టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ విజన్ , కమర్షియల్ స్కేల్ పరంగా తదుపరి స్థాయికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా హ్యాట్రిక్బ్లాక్‌బస్టర్లు `జవాన్` లాంటి ఆల్-టైమ్ రికార్డు హిట్‌తో పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రాకా` పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌తో అట్లీ భారతీయ సినిమా దార్శనికుడు ఎస్.ఎస్. రాజమౌళి సాధించిన మైలురాళ్లకు అడుగు దూరంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

రాజమౌళిని భారతీయ సినిమా బిగ్గెస్ట్ విజువల్ విజనరీగా నిలబెట్టిన ప్రధానాంశం  అద్భుతమైన విజువల్ వండర్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలను మిళితం చేయడం. తాజాగా `రాకా` చిత్రంలో అట్లీ సైతం సరికొత్త విజువల్ వరల్డ్‌ను ఆవిష్కరించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు హై-వోల్టేజ్ మాస్ డ్రామాలను రూపొందించిన అట్లీ ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ,  గ్రాండ్ స్కేల్ లొకేషన్లతో ఊహించని విజువల్ ఫీస్ట్‌ను అందించబోతున్నారట.

`రాకా`లో విజువల్స్ ,  గ్రాఫిక్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలలో క్లిక్ అయితే రాజమౌళితో అట్లీ విజన్‌ను పోల్చే వాతావరణం కచ్చితంగా ఏర్పడుతుందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా? రాజమౌళితో పోలిక రావడం అనేది ఏ దర్శకుడికైనా గొప్ప గౌరవంతో పాటు అంతే స్థాయి బాధ్యతను పెంచుతుంది.

`రాకా` విజువల్స్ ,  కంటెంట్ గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తే అట్లీ  మాస్ డైరెక్టర్‌గానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విజువల్ విజనరీగా తన బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలపరుచుకుంటారు. భారతీయ కమర్షియల్ సినిమా సత్తాను ప్రపంచ వేదికపై మరోసారి చాటడానికి అట్లీ సిద్ధం చేస్తున్న  `రాకా` రాజమౌళి లీగ్‌కు ఎంత సమీపంలో నిలబెడుతుందో? చూడటానికి పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Atlee vs Rajamouli!