ప్యారడైజ్ కి ఈ ఒక్క ఈవెంట్ చాలు
The Paradise Pre Release Event Highlights
ది ప్యారడైజ్ విడుదలకు జస్ట్ ఒక్క రోజు మాత్రమే ఉంది. ప్యారడైజ్ ట్రైలర్ లేదు సినిమా పై ఎలాంటి హైప్ ఉంటుందో అనుకుంటే ప్యారడైజ్ ట్రైలర్ లేకపోయినా ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ప్యారడైజ్ టికెట్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ అయితే అంటే ఓవర్సీస్, నైజాం ఇలా ఎక్కడ ఓపెన్ అయినా నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఇక ప్యారడైజ్ కి ఉన్నంతలో హీరో నాని ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై, బెంగుళూరు, కొచ్చి హైదరాబాద్ లో అభిమానులతో లంచ్, అలాగే స్పెషల్ ఫొటోస్ షూట్స్, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ చాలా హడావిడి చేసాడు. అంతేకాదు హీరోయిన్ కాయదు లోహర్ తో కలిసి తెలుగు మీడియాకి ఇంటర్వూస్ ఇస్తున్నాడు.
అయితే గత రాత్రి జరిగిన ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటి చాలు సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడానికి అంటూ సోషల్ మీడియా మొత్తం ప్యారడైజ్ గురించే .మాట్లాడుకుంటున్నారు. నాని విలన్ రాఘవ్ జుయల్ సుమ తో కలిసి చేసిన డాన్స్, హీరో నాని, కాయదు స్టేజ్ కింద వేసిన డ్యాన్స్ అన్ని ఆ ఈవెంట్ లో హైలెట్ అయ్యాయి.
ప్యారడైజ్ కి లిమిటెడ్ ప్రమోషన్స్, సో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనుకుంటే అస్సలు ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్స్ ఉన్నాయి. మరి నాని రేంజ్ ఏమిటి అనేది ప్యారడైజ్ ఓపెనింగ్స్ తోనే తేలిపోయేలా కనిపిస్తుంది.
















































