ప్రభాస్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే
Disappointment again for Prabhas fans
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం పదే పదే వాయిదాలు పడుతూ అభిమానులను నిరాశలోకి నెట్టేస్తుంది. ఆగష్టు అన్నారు, దసరా అన్నారు, డిసెంబర్ 3 ఫిక్స్ చేసారు. డిసెంబర్ 2 నే ఫౌజీ ప్రీమియర్స్ అంటూ ఊరించారు.. కానీ ఏమైంది మళ్లీ ఫౌజీ వాయిదా అనివార్యమైంది.
నిన్నటివరకు ఉన్న ఫౌజీ వాయిదా వార్తలను మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్ ఇండైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేసారు. గత రాత్రి ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఫౌజీ విడుదల ఆలస్యమవుతుంది అంటూ.. డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే వార్తలను నిజం చేస్తూ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాయి.
మరి డిసెంబర్ 3 నుంచి కొద్దిగా ఆలస్యంగా విడుదలవుతుంది అంటే క్రిష్ట్మస్ కి ఏమైనా ఫౌజీ విడుదల ప్లాన్ చేస్తున్నారా, లేదంటే సంక్రాంతికి ఫౌజీ ని దించే ఆలోచనలో ఉన్నారో తెలియదు కానీ ఫౌజీ రిలీజ్ అయితే ప్రస్తుతం పోస్ట్ పోన్ అయినట్లే.
















































