జనవరి 12 విడుదలకు క్రేజీ ఓటీటీ డీల్

January 12 Vidudala gets crazy dealJanuary 12 Vidudala gets crazy deal


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న జనవరి 12 విడుదల చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అటు షూటింగ్ చేస్తూనే దర్శకుడు అనిల్ రావిపూడి బుల్లితెర షోస్ లో జెడ్జి గా కనిపిస్తున్నారు. అదే వేరే దర్శకులైతే రేయింబవళ్లు సినిమా సెట్ లో నిద్రాహారాలు మానేసి విడుదల కోసం కష్టపడుతూ కనిపిస్తున్నారు.

కానీ అనిల్ రావిపూడి మాత్రం తన సినిమా షూటింగ్ ని చాలా కూల్ గా ఫినిష్ చేస్తారు. షూటింగ్ ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో ప్రమోషన్స్ అంత క్రేజీగా మొదలు పెడతారు. ఇక వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరుదులుగా కనిపించనున్న జనవరి 12 విడుదల చిత్రంపై ట్రేడ్ లో మంచి బజ్ ఉంది.

అలాగే ఓటీటీ సంస్థలు కూడా అనిల్ రావిపూడి సినిమా కోసం కాచుకుని కూర్చున్నాయి. ఎప్పుడు అనిల్ రావిపూడి సినిమాలు కొని లాభపడే జీ 5 మరోసారి జనవరి 12 విడుదల కోసం భారీ డీల్ ని మేకర్స్ ముందు పెట్టిందట. జీ 5 ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులను ఏకంగా రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

మరి జనవరి 12 విడుదల చిత్రానికి ఇది క్రేజీ డీల్ అంటున్నారు. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ తరపున కృతి శెట్టి కనిపిస్తుండగా.. ఈరోజు కృతి శెట్టి బర్త్ డే కి ఈ చిత్రం నుంచి ఆమె ట్రెడిషనల్ లుక్ రివీల్ చేస్తూ విషెస్ తెలిపింది టీమ్. 

January 12 Vidudala rights bagged for a fancy sum