`పెద్ది`, `టాక్సిక్` కే వసూళ్లకే ఎసరు పెట్టిందా?
Peddi
భక్తిరస చిత్రం `హనుమాన్ అంశ` ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్ల మార్కును దాటింది. ఎలాంటి భారీ అంచనాలు .. ప్రచారం లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా ఊహించని రీతిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన ఆరో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతూ కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇస్తుండటం విశేషం.
ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎంతో ఆశ్చర్యకరంగా సాగింది. మొదటి రోజు 10 లక్షల వసూళ్లతో ప్రారంభమై, తొలి రెండు వారాల్లో కలిపి 1.50 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణతో వసూళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. నాలుగో వారం నుండి ప్రతీ వారం దేశంలో 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది.
విడుదలైన 41వ రోజున కూడా భారతదేశంలో 6 కోట్ల నెట్ వసూలు చేయడంతో దేశీయంగా మొత్తం కలెక్షన్లు రూ. 237 కోట్ల నెట్ (రూ. 280 కోట్ల గ్రాస్)కు చేరుకున్నాయి. దీంతో ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల రిలీజ్అ యిన `మిర్జాపూర్ ది మూవీ` కంటే దాదాపు 50 శాతం ఎక్కువ వసూళ్లను సాధిస్తూ ప్రభావాన్ని చూపిస్తోంది.
దేశీయంగా వచ్చిన న క్రేజ్‌ను చూసి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమా అంతర్జాతీయ పంపిణీ హక్కులను దక్కించుకుంది. విదేశాల్లో ఆలస్యంగా విడుదలైనప్పటికీ రెండు వారాల్లోనే 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 16 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 300 కోట్ల మార్కును దాటాయి.
2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో `హనుమాన్ అంశ` తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ చిత్రం భూత్ బంగ్లా (రూ. 250 కోట్లు) రికార్డును అధిగమించిన సినిమా ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో `టాక్సిక్`, `పెద్ది` వంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి టాప్ 3 స్థానంలోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీనారాయణ అనే యువకుడి ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. తల్లి మరణం తర్వాత జీవితం, మరణం, మానవ బాధలకు సమాధానాల కోసం ఉత్తర భారతదేశంలో పర్యటించి చివరికి ప్రముఖ సాధువు నీమ్ కరోలీ బాబాగా మారే కథాంశంతో సినిమా రూపొందింది. ఇందులో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారి, అనిల్ రస్తోగి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.















































