నాని బైబిల్ కామెంట్స్ పై దుమారం
Instant Trolling for Nani's Bible Comment
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం ఈ నెల 24 న విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం సమయం తక్కువ ఉండడంతో నాని హడావిడిగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. అందులో భాగంగా నిన్న సాయంత్రం ముందుగా చెన్నై నుంచి ప్యారడైజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
చెన్నై ప్రెస్ మీట్ లో విజయ్ సీఎం గా చాలాబాగా చేస్తున్నారని చెప్పిన నాని, చెన్నైకి వస్తే ఇంటికి వచ్చిన భావన కలుగుతుందని ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇక తమిళ పరిశ్రమ నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను అని మాట్లాడుతున్న సందర్భంలో తమిళ సినిమా నాకు బైబిల్ లాంటిది అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అయితే నాని బైబిల్ అంటూ కామెంట్లు చూసి నాని హిందూ కాదు, క్రిష్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఓవర్గం నాని ని టార్గెట్ చేసింది. తాను నటుడిగా ఎదుగుతున్న క్రమంలో తమిళ సినిమాలను చూసి ఎంతో నేర్చుకున్నానని, నటన పరంగా తనకు అవి ఎంతో ఉపయోపగపడ్డాయని చెప్పే క్రమంలో నాని తమిళ సినిమా నాకు బైబిల్ లాంటిది అంటూ మాట్లాడడం చాలామందికి నచ్చలేదు.
















































