ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Irumudi will premiere on Netflix on September 18

ఓటీటీ లోకి బ్లాక్ బస్టర్ మూవీ

Irumudi will premiere on Netflix on September 18Irumudi will premiere on Netflix on September 18

 

థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి రూ.250 కోట్లతో స్ట్రాంగ్ బెంచ్ మార్క్ ని సృష్టించిన రవితేజ ఇరుముడి చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇరుముడి చిత్రం మంచి అంచనాలతో ఆగష్టు 21 న విడుదలై థియేటర్స్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇరుముడి విడుదలైన మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ ఇరుముడిపై కనకవర్షం కురిపించారు. దానితో రవితేజ కెరీర్ లోనే ఇరుముడి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇరుముడి సెప్టెంబర్ 18 అంటే ఈరోజు నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

ఇరుముడి డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇరుముడి ని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేయ్యండి. 
 

Irumudi streaming now on Netflix