నాని క్లాస్ అండ్ మాస్ కలిపి కొడుతున్నాడే!
Nani is striking a perfect balance between class and mass appeal!
నేచురల్ స్టార్ నాని క్లాస్ + మాస్ ప్రేక్షకులను ఒకేసారి అలరించేలా పక్కా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. పూర్తిగా క్లాస్ జోనర్ లేదా పూర్తిగా ఊర మాస్ జోనర్ అని వేర్వేరు సరిహద్దులను గీసుకోకుండా, రెండింటినీ సమతుల్యం చేస్తూ సినిమాలు చేయడం నానికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఒక వైపు విభిన్నమైన ఎమోషనల్ అండ్ క్లాస్ కథలను, మరోవైపు థియేటర్లలో ఈలలు వేయించే పవర్ ఫుల్ మాస్ పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు.
నాని అనుసరిస్తున్న ఈ వర్కింగ్ స్టైల్ ఆయన కరీర్‌ను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. ఒక సినిమా పూర్తి క్లాస్ జోనర్‌లో ఉంటే? దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ ఖచ్చితంగా పూర్తి మాస్ ఓరియెంటెడ్‌గా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ఈ రకమైన ప్రణాళిక వల్ల ఒకే రకమైన కథలతో ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా ఉండటమే కాకుండా ఆయన నటనా పరిధి స్పష్టమవుతోంది. క్లాస్ కథల్లో ఎంతగా లీనమై నటిస్తారో? మాస్ యాక్షన్ సీన్లలో అంతటి రౌద్రం, ఎనర్జీ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
ఒకదాని తర్వాత ఒకటిగా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న వరుస ప్రాజెక్టులతో నాని టాలీవుడ్‌లో అత్యంత నమ్మకమైన హీరోగా నిలిచారు. క్లాస్ సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను, మహిళలను థియేటర్లకు రప్పిస్తూనే మాస్ సినిమాలతో యూత్ , మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నారు. ఇలా క్లాస్, మాస్ ఎలిమెంట్స్‌ను వేర్వేరు సినిమాల తో అందిస్తూ ప్రయోగాలకు వెరవకుండా ముందుకు సాగుతున్న నాని భవిష్యత్ లో కూడా బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
















































