ఈ వారం మూడు వాయిదాలు
Three postponement this week
ది ప్యారడైజ్ వచ్చేవరకు చిన్న సినిమాల జాతర తప్ప క్రేజీ సినిమాలేవీ బాక్సాఫీసును పలకరించడం లేదు. ఈ నెలలో విడుదలైన చాలా సినిమాలు జస్ట్ యావరేజ్, లేదంటే డిజాస్టర్ దగ్గరే ఆగిపోయాయి. ఇక ఈవారం విడుదల అన్న మూడు సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో బాలీవుడ్ లో ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ అంశ్. సెప్టెంబర్ 18 అంటే రేవు తెలుగులో విడుదల కావాల్సి ఉంది.
ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడం, సెన్సార్ చిక్కులతో పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది. మరొకటి ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన 418 కూడా రేపు శుక్రవారమే విడుదల కావాల్సి ఉంది. మైత్రి వారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కంటెంట్ అంటూ నమ్మి రేపు విడుదల చెయ్యకుండా పోస్ట్ పోన్ చేసి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మరో చిన్న సినిమా అనుమాన పక్షి కూడా ఈ వారం విడుదలవ్వాలి. కానీ సెన్సార్ ఆలస్యంతో ఆ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నారు మేకర్స్. మరి ఈ వారం విడుదల కావల్సి మూడు చిత్రాలు ముచ్చటగా పోస్ట్ పోన్ అయ్యాయన్నమాట.
















































