సర్దార్ 2 ఎఫెక్ట్ హీరోయిన్ పై!
Sardar 2 Public Talk
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా తెరకెక్కిన సర్దార్ 2 గత గురువారం విడుదలైంది. కార్తీ హీరోగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్దార్ 2 చిత్రానికి తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ కనిపించింది. డిజాస్టర్ రివ్యూస్, డిజాస్టర్ టాక్ తో సర్దార్ 2 వార్తల్లో లేకుండా పోయింది.
ఈ సినిమా ఎఫెక్ట్ కార్తీ కెరీర్ పై ఎంత పడిందో అంతకు మించి హీరోయిన్ మాళవిక మోహనన్ పై పడింది అనే హిప్పాలి. ఆమె వరస సినిమాలు చేస్తూనే ఉంది కానీ విజయమన్నదే ఆమె దరి చేరడం లేదు. కేవలం ఆమెను దర్శకులు గ్లామర్ డాల్ గానే గుర్తిస్తున్నారు కానీ.. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఆమెకు ఇవ్వడం లేదు.
సోషల్ మీడియాలో చూపించే అందాలే, గ్లామరే మాళవిక సినిమా ల్లోను చూపిస్తుంది, అంతేతప్ప ఆమెలో మరె కొత్తదనమ్ చూడలేం అంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.
ఈ ఏడాది తెలుగులో రాజాసాబ్ మాళవికాను బాగా డిజప్పాయింట్ చెయ్యగా.. ఇదే ఏడాది సర్దార్ 2 ఆమెను తమిళనాట తీవ్రంగా నిరాశపరిచింది. రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ మాళవిక మోహనన్ కు బిగ్ షాక్ నిచ్చాయి. మరి ఈ హీరోయిన్ కి బ్రేకిచ్చే హీరో ఎవరో చూడాలి.
















































