యాక్టివ్ అవుతున్న యువ హీరో

Young hero becoming activeYoung hero becoming active

 

యువ హీరో నాగ శౌర్య కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యాడు. బ్యాడ్ బాయ్ కార్తీక్ ని నామ మాత్రంగా ప్రమోట్ చేసి విడుదల చేసాక నాగ శౌర్య పబ్లిక్ గా కనిపించింది లేదు. ఎలాంటి కొత్త సినిమా కూడా ప్రకటించలేదు. మరోపక్క నాగ శౌర్య వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో ఉంది, భార్య అనూష తో విడాకులు కూడా తీసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది.

కానీ నాగ శౌర్య మెల్లగా యాక్టీవ్ అవుతున్నాడు. భార్య అనూష తో కలిసి వెకేషన్ కు వెళ్లిన ఫొటోస్ మాత్రమే కాదు, తల్లి, తండ్రులతో కలిసి, భార్య సమేతంగా వినాయక చవితి పండుగ ను సెలెబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫొటోస్ చూసాక నాగ శౌర్య లైన్ లోకి వస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు.

ఇదే ఊపులో ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్ కబురు వినాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి నాగ శౌర్య సోషల్ మీడియాలో యాక్టీవ్ అయినట్లుగా సినిమాల విషయంలోనూ యాక్టీవ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. 

Naga Shaurya becoming active