పోస్ట్ పోన్ అంటే రిలీజ్ అయ్యి వేస్ట్
Hanuman Ansh Telugu Release To Be Deferred?
ఆగష్టు లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ అంశ్ ఇప్పుడు క్రేజీ బ్లాక్ బస్టర్ గా అందరి నోటిలో నానుతుంది. రూ.250 కోట్ల కలెక్షన్స్ తో హనుమాన్ అంశ్ అన్ని భాషల్లో హాట్ కేక్ లా మారిపోయింది. హిందీలో హిట్ అయిన ఈ చిన్న చిత్రాన్ని తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 40 రోజుల తర్వాత.
దానితో తెలుగులో ఈ చిత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే చర్చలు మొదలయ్యాయి. అసలైతే ఈశుక్రవారం అంటే సెప్టెంబర్ 18 నే హనుమాన్ అంశ్ విడుదల కావాల్సి ఉంది. అంటే ఒరిజినల్ వెర్షన్ విడుదలైన 40 రోజులకు తెలుగు లో రిలీజ్ అన్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 18 న విడుదల కావడం లేదు హనుమాన్ అంశ్ పోస్ట్ పోన్ అంటున్నారు.
అందుకే సినిమా ట్రైలర్ కూడా వదల్లేదు. ఇది రేపు శుక్రవారం విడుదల కావడం లేదు, కారణం సెన్సార్ అవ్వలేదు అంటుంటే.. నిజంగా ఇది తెలుగులో రిలీజ్ పోస్ట్ పోన్ అంటే గనక ఇకపై రిలీజ్ అయ్యి వేస్ట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి హనుమాన్ అంశ్ ఎంత త్వరగా విడుదలైతే అంత బెటర్ లేదంటే లేదు అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది.
















































