ప్రెగ్నెన్సీ టైమ్‌లో సమంత క్రేవింగ్స్!

Samantha's cravings during pregnancy!Samantha's cravings during pregnancy!

నటి సమంత త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధురమైన ప్రయాణంలో ఎదురవుతున్న ఆహారపు కోరికలు , ఇష్టమైన వంటకాల గురించి సమంత ఓపెన్ అయ్యారు.  ప్రెగ్నెన్సీ సమయంలో తనకు చాలా సాధారణమైన .. సాంప్రదాయక దక్షిణాది వంటకాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలిపారు.

ఉదయం టిఫిన్‌గా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనంలో పెరుగన్నం, రాత్రికి వేడివేడి దోశలు తినడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. ఇవన్నీ ప్రస్తుతం  ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌లో భాగమేనని, ఇవి సమయానుకూలంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ఇటీవల తన సినిమా విజయంతో పాటు తన సీమంతం విశేషాలను, ప్రెగ్నెన్సీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ప్రస్తుతం సమంత  వృత్తిపరమైన అంగీకారాలను పూర్తి చేసుకుని కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు  హోస్ట్‌గా చేసిన `సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ్` కార్యక్రమం కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఈ ప్రత్యేక సమయంలో సరళమైన ఇంటి ఆహారాన్ని ఆస్వాదిస్తూ  జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ఎంతో సంతోషంగా స్వాగతిస్తున్నట్లు సమంత తెలిపారు.

Samantha reveals South Indian snacks she gorged on during pregnancy cravings