పారితోషికాలు ల‌క్ష‌ల్లో...వ‌సూళ్లు కోట్ల‌లో!

Hanuman Ansh - Box Office CollectionHanuman Ansh - Box Office Collection

ఆధ్యాత్మిక వేత్త నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన `హనుమాన్ అంశ` చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం 2 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మితమై,  బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అసాధారణ విజయాన్ని నమోదు చేసింది.  సంచలన విజయం నేపథ్యంలో చిత్రంలో నటించిన నటీనటులకు అందిన పారితోషికాల వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

చిత్రంలో నీమ్ కరోలీ బాబా ప్రధాన పాత్రను పోషించి ఆక‌ట్టుకున్న‌ నటుడు శోభినావ్ సత్య అత్యధికంగా 15 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తొంది. ఆసక్తికర విషయం ఏంటంటే? శోభినావ్ మొదట ఈ సినిమాకు కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే పనిచేశారు. అయితే ఆయన రూపం, నడవడిక బాబాతో సరిపోలడంతో దర్శకుడు ఆయన్ని ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. ఇక చిత్రంలోని ఇతర కీలక పాత్రధారులకు  3 లక్షల నుండి 8 లక్షల వరకు సింగిల్ రెమ్యునరేషన్ లభించింది.

చిత్రంలోని మిగతా నటీనటుల విషయానికి వస్తే చందన్ ఆనంద్ అత్యధికంగా 8 లక్షలు తీసుకోగా, విహాన్‌కు  5 లక్షలు, అనిల్ రస్తోగికి 4 లక్షలు, పూర్ణిమ తివారీకి 3.5 లక్షలు , గుల్షన్ పాండేకు 3 లక్షల పారితోషికం లభించినట్లు సమాచారం. ఎలాంటి అట్టహాసాలు లేకుండా కేవలం కథ , ఆధ్యాత్మిక అంశాల నమ్మకంతో నిర్మించిన చిత్రం 150 కోట్లు సాధించి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన ఇండియన్ చిన్న  సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
 

Hanuman Ansh