ఎపిక్ ప్రీమియర్స్ టాక్

Epic Premieres TalkEpic Premieres Talk

 

విజయ్ దేవరకొండ కు తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై బేబీ చిత్రం తో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆనంద్ దేవరకొండ కు ఆ చిత్రం తర్వాత మళ్లీ అంతటి సక్సెస్ మరె మూవీకి దొరకలేదు. బేబీ పెయిర్ ఆనంద్ దేవరకొండ-హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇద్దరిది అదే పరిస్థితి. ఇప్పుడు బేబీ జోడి ని రిపీట్ చేస్తూ సితార నాగవంశీ ఎపిక్ - ఫస్ట్ సెమిష్టర్ అంటూ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గత రాత్రే మీడియా వారికి ప్రీమియర్స్ వెయ్యడంతో.. ఎపిక్ చిత్రం ఎలా ఉందొ అనేది సోషల్ మీడియాలో మీడియా మిత్రులు స్పందిస్తున్నారు. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. ఎపిక్ ఫస్ట్ హాఫ్ అధ్బతంగా సాగడమే కాదు, కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య యాక్టింగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ ఫుల్ యూత్‌ఫుల్‌గా, యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చినా సాగదీత సన్నివేశాలు, స్టోరీ అసంపూర్ణంగా ఉండడం ఎపిక్ కి మైనస్ లుగా చెబుతున్నారు. ఆదిత్య హసన్ కథను మెచ్యూర్‌గా హ్యాండిల్ చేసి, క్లైమాక్స్‌ను కొత్తగా చూపించారు.

హేష‌మ్ అబ్దుల్ వాహ‌బ్ అందించిన BGM అదిరిపోయింది, కాకపోతే అసంపూర్ణంగా కథను మధ్యలోనే వదిలెయ్యడమే ఎపిక్ కి మెయిన్ మైనస్. ఎపిక్ ఫుల్ రివ్యూ మరికాసేపట్లో..

Epic SOcial Media Talk