ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aishwarya Lekshmi discusses her experiences with trolls

ట్రోల్స్ కి భయపడిపోయా: ఐశ్వర్య లక్ష్మి

Aishwarya Lekshmi discusses her experiences with trolls Aishwarya Lekshmi discusses her experiences with trolls


ఈమధ్యనే గట్ట కుస్తీ 2 తో తమిళనాట హిట్ అందుకున్న ఐశ్వర్య లక్ష్మి ఓ మలయాళ సినిమా వల్ల తన కెరీర్ లో ఎంతగా సఫర్ అయ్యిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కింగ్ ఆఫ్ కొథా చిత్రంలో హీరోయిన్ గా నటించడం తన బ్యాడ్ లక్, ఆ సినిమా ప్లాప్ అవడం తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకొచ్చింది.

ఆ కింగ్ ఆఫ్ కొథా చిత్రం విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా విడుదలయ్యాక మలయాళ ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇవ్వడానికి భయపడినట్లుగా నాకు అనిపించింది. నాపై మాత్రమే కాదు, సినిమా టీమ్ పై అలాగే హీరో దుల్కర్ పై కూడా పలు విమర్శలు వచ్చాయి. నా యాక్టింగ్, డైలాగ్స్ ను కూడా విమర్శించారు.

ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి ఓ ప్రోడక్ట్ యాడ్ షూట్ లో పాల్గొనడానికి అవకాశం వచ్చినా ఆ ట్రోల్స్ చూసి భయపడి ఆ ఛాన్స్ వదులుకున్నాను, నేను గనక ఆ యాడ్ లో నటిస్తే మళ్లీ విమర్శలు వస్తాయని నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను, ఆ సినిమా ట్రోల్స్ నన్ను అంతగా భయపెట్టాయి అంటూ ఐశ్వర్య లక్ష్మి మలయాళ సినిమా అనుభవం గురించి చెప్పుకొచ్చింది. 

Aishwarya Lekshmi addresses dress controversies and trolls