బిగ్ బాస్ కోసం పెద్ద సాహసమే!
Bigg Boss Telugu 10: Nandu's wild-card entry sparks buzz
యుకె లో ఉంటూ యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యి యుకె వీసా ల పేరుతొ మోసం చేసిన కేసులో రమా నందన, ఆమె భర్త మధుకర్ లపై నమోదైన కేసుల్లో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు. ఏపీలో నందన, మధుకర్, మధుకర్ తండ్రిపై పలు కేసులు నమోదు అయ్యాయి.
ఇక సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడంతో తెలుగు దర్శకులు నందన అలియాస్ నందూస్ వరల్డ్ నందు ని తమ సినిమాల్లో తీసుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో నందన నయన్ కు ఫ్రెండ్ గా కనిపించింది.
ఆతర్వాత ఆమెకు ఈఏడాది బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది అని సమాచారం. దాని కోసం ఆమె ఇండియాకి వస్తే లుకవుట్ నోటీసుల ప్రకారం అరెస్ట్ అవుతుంది. అందుకే ముందుగానే రమా నందన ఇక్కడి పోలీసులకు మెయిల్ పెట్టింది. 15 రోజులు తాను విచారణకు సహకరిస్తాను, లుకవుట్ నోటీసులు ఎత్తేయమని. కానీ పోలీసులు ఒప్పకోలేదు.
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు వచ్చిన నందన ఇండియాకి రాగానే ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బెయిల్ తెచ్చుకుని ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు అరెస్ట్ అయ్యి, బెయిల్ పై బయటకు రావాలని నందన నిజంగా పెద్ద సాహసమే చేసింది.







































