శృతి హాసన్ లేటెస్ట్ స్మైలీ లుక్

Shruti Haasan latest look viralShruti Haasan latest look viral

 

కోలీవుడ్ తార శృతి హాసన్ ఈమధ్యన సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార చిత్రం తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ 2 అమ్మడు చేతిలో ఉంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే.

కొద్దిరోజులుగా శృతి హాసన్ సోషల్ మీడియాలో తప్ప బయట ఎక్కడా కనిపించడమే లేదు. ప్రస్తతం శృతి హాసన్ సోషల్ మీడియా లుక్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా శృతి హాసన్ వదిలిన పిక్స్ చూసి వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్లూ మోడ్రెన్ డ్రెస్ లో చిన్న స్మైల్ తో శృతి హాసన్ స్టైలిష్ గా కనిపించింది.

లూజ్ హెయిర్, స్టైలిష్ లుక్ తో శృతి హాసన్ న్యూ అవతార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఈ సోషల్ మీడియా క్రేజీ లుక్స్ అయినా శృతి హాసన్ కి కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చి పెడతాయేమో చూడాలి. 

Shruti Haasan