ఒక్క వారం - నయన్ కి రెండు షాక్ లు
Two shocks for Nayanthara
ఈ ఒక్క వారంలో లేడీ సూపర్ స్టార్ నయనతారకు రెండు బిగ్ షాక్ లు తగిలాయని చెప్పాలి ఆమె నటించిన పాన్ ఇండియా ఫిలిమ్ టాక్సిక్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. అసలు కథ లేకుండా దర్శకురాలు గీతూ టాక్సిక్ ని తెరకెక్కించారు అంటూ ఆడియన్స్ తిట్టిపోస్తున్నారు.
ఈ చిత్రంలో నయనతార నటించింది. నయన్ ను ఒప్పించడంలో గీతు సక్సెస్ అయినా.. నయన్ కు ఆవిడ టాక్సిక్ తో సక్సెస్ ఇవ్వలేకపోయారు. టాక్సిక్ చిత్రం తో నయనతార డిజాస్టర్ ను కొని తెచ్చుకుంది. సెంటిమెంట్ బ్రేక్ చేసి మరీ టాక్సిక్ ప్రమోషన్స్ లో నయన్ కనిపించింది. అయినా వర్కౌట్ అవ్వలేదు.
ఇక ఇదే వారం విడుదలైన నయనతార హాయ్ మూవీ కి కూడా అంత మంచి రివ్యూస్ రాలేదు. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం హాయ్. ఏమాత్రం కొత్తదనం లేని కథ, హాయ్ ఓ రొటీన్ లవ్ స్టోరీ. నయనతార, కవిన్ లీడ్ పెయిర్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లు ఏమీ లేవు. ఇది హాయ్ పై ఆడియన్స్ అభిప్రాయం.
సో హాయ్ కూడా నయనతార ను డిజప్పాయింట్ చేసింది. ఒకే వారంలో నయనతార అటు టాక్సిక్, ఇటు హాయ్ రెండు చిత్రాలతో బిగ్ షాక్ తినింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







































