ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pregnant Samantha shares workout video

సమంత: అంత హెవీ వర్కౌట్స్ ?

Pregnant Samantha shares workout video Pregnant Samantha shares workout video


టాప్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్. ఆమె గత ఏడాది రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకుంది. సమంత కు రాజ్ కి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. ఈ ఏడాది సమంత ప్రెగ్నెంట్ అయ్యింది. మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో ఆ విషయాన్నీ అందరితో పంచుకుంది. ఆతర్వాత మెటర్నిటీ లీవ్ అంటూ నటనకు బ్రేకిచ్చింది.

భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీ మూన్ అంటూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈలోపు అంటే ఆమె డెలివరీ అయ్యేలోపు సమంత తమిళంలో ఓ కుకింగ్ షో కి హోస్ట్ గా మారింది. అయితే సమంత ప్రెగ్నెంట్ అయినప్పటికి ఆమె జిమ్ లో వర్కౌట్స్ కానీ, యోగ కానీ మానలేదు. ప్రెగ్నెంట్ తో ఉన్నా అంతలా వర్కౌట్స్ చెయ్యొచ్చా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేసారు.

తాజాగా సమంత జిమ్ లో హెవీ బరువు ఎత్తుతూ కనిపించింది. అంతేకాదు యోగ మ్యాట్ పై సమంత యోగ చేస్తూ దిగిన ఫొటోస్ ని వీడియోస్ ని చూసి సమంత ప్రెగ్నెన్సీ లో ఇంత హెవీ వర్కౌట్స్ చెయ్యొచ్చా అని అందరూ కామెంట్లు పెడుతున్నారు. చిన్న చిన్న వర్కౌట్స్ ఓకే కానీ ఇలా ఎక్కువ బరువు ఎత్తడం కరెక్ట్ కాదేమో అంటున్నారు.

Pregnant Samantha shares workout video with disclaimer