పరభాషా మూవీకి రెడ్ కార్పెట్-తెలుగు హీరో సెన్సేషనల్ కామెంట్స్
Kiku Yanamala made sensational comments
ఈమధ్యన కన్నడ లో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం యశ్ టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. 50,000 స్టూడెంట్స్ నడుమ ఈవెంట్ ని జరిగింది. అయితే మల్లారెడ్డి టాక్సిక్ ఈవెంట్ స్టేజ్ పై పాలు అమ్మాను, పూలు అమ్మను అంటూ తన ఊత పదాన్ని వాడారు.
తాజాగా తెలుగు హీరో ఒకరు మల్లారెడ్డి పై ఇండైరెక్ట్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కికు చిరంజీవి తో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో కికు యనమల సినిమా ఈవెంట్ లో చిన్న సినిమాలకు ఎదురవుతున్న సమస్యలపై గొంతెత్తి మాట్లాడాడు. చిన్న సినిమాలకు థియేటర్స్ మాత్రమే కాదు.. ఆఖరికి ప్రమోషన్స్ విషయంలోనూ అన్యాయం జరుగుతుంది అన్నారు.
తాన సినిమా ఆంధ్ర టూర్ ముగించుకుని హైదరాబాద్ లో ప్రమోషన్స్ కోసం ఓ కాలేజ్ వాళ్ళు ముందు పర్మిషన్ ఇస్తాను అని ఆతర్వాత మా ఫోన్ కూడా ఎత్తలేదు పాలు అమ్మాను, పూలు అమ్మను అనే ఓ పెద్దమనిషి చిన్న సినిమా అయిన కికు చిరంజీవి ని ఎందుకు ప్రమోట్ చెయ్యాలి అనుకున్నారో ఏమో, ఓ పరభాషా సినిమాని మాత్రం నెత్తిన పెట్టుకుని రెడ్ కార్పెట్ పరిచి మరీ ప్రమోషన్స్ చేసారు.
పూలమ్మినా, పాలమ్మినా, కింది నుంచి పైకొచ్చినా అనే పెద్ద మనిషి తెలుగు సినిమాలను పట్టించుకోకుండా పర భాషా సినిమాలను నెత్తినపెట్టుకుంటున్నారు అంటూ ఆ హీరో ఎక్కడా మల్లారెడ్డి పేరు కానీ, ఆ పెద్ద సినిమా పరభాషా సినిమా గురించి చెప్పకుండా ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ అవుతున్నాయి.







































