వారణాసి తర్వాత రావిపూడి తో మహేష్ ?
Mahesh Babu With Anil Ravipudi After Varanasi?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తో వారణాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతుంది. ఐతే మహేష్ బాబు వారణాసి తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంలో అభిమానుల్లో చాలా సస్పెన్స్ నడుస్తుంది. వారణాసి గ్లోబల్ మూవీ. దాని తర్వాత అంటే మహేష్ ఏ బాలీవుడ్ దర్శకుడితోనో సినిమా చేసే ఛాన్స్ ఎక్కువగా వుంది.
అయితే వారణాసి తర్వాత మహేష్ తో అనిల్ రావిపూడి సినిమా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అంటూ కొద్ధి గంటల క్రితం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ గా తన నెక్స్ట్ సినిమాని వెంకీ-కళ్యాణ్ రామ్ కలయికలో జనవరి 12 విడుదల అనే టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. అయితే గతంలో మహేష్ కి సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి మధ్యలో ఒకసారి మహేష్ తో సినిమా చెయ్యాలని ట్రై చేసాడు కానీ కుదరలేదు వారణాసి తర్వాత ఆ ఛాన్స్ వస్తుందేమో అనే న్యూస్ స్టార్ట్ అయ్యింది.
ఇక మహేష్ ఛాన్స్ ఇస్తే ఓకే లేదంటే అనిల్ రావిపూడి చిరు ఇంకా నాగ్ కలయికలో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.







































