యశ్ స్టామినాకు బిగ్ టెస్ట్
A big test for Yash's stamina
కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో చెరగని ముద్ర వేసిన కన్నడ స్టార్ యశ్ ఆ రెండు చిత్రాలతో వందల కోట్లు ఇండియన్ బాక్సాఫీసు నుంచి కొల్లగొట్టారు. కేజిఎఫ్ తర్వాత చాలా పెద్ద బ్రేక్ తీసుకుని ఆచి తూచి లేడీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ చిత్రం చేసారు. ఎప్పుడో మార్చ్ లో విడుదల కావాల్సిన టాక్సిక్ పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఫైనల్ గా ఈ నెల 26 న విడుదలకు సిద్దమైంది.
మరి కేజిఎఫ్ తో తెచ్చుకున్న క్రేజ్ యశ్ టాక్సిక్ పై ఎంత ఉంటుంది అనేది రేపు ఓపెనింగ్స్ తోనే తేలిపోతుంది. యశ్ స్టామినా టాక్సిక్ ఓపెనింగ్స్ తో ప్రూవ్ అవ్వాలని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో టాక్సిక్ పై మంచి క్రేజ్ ఉంది, టికెట్ బుకింగ్స్ లోను యశ్ క్రేజ్ స్టార్ట్ అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి ఎఫెక్ట్ టాక్సిక్ పై పడే అవకాశం ఉంది, ఇరుముడి థియేటర్స్ తో టాక్సిక్ సర్దుకుపోవాలి, సో తెలుగులో టాక్సిక్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మిగతా లాంగ్వేజెస్ లో టాక్సిక్ ఓపెనింగ్స్ కుమ్మెయ్యడం గ్యారెంటీ.







































