మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: కాక గ్లింప్స్ విత్ డేట్
Kaaka Title Glimpse: Mega Mass Euphoria
ఆగష్టు 22 మెగా ఫ్యాన్స్ కి పండగ రోజు. మెగాస్టార్ చిరు పుట్టిన రోజు ఈరోజు. టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా, మెగా అభిమానులకు పెద్దన్నగా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో సేవ కార్యక్రమాలతో అందరితో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా స్పెషల్ డే అని చెప్పాలి.
చిరు బర్త్ డే ని మెగా ఫ్యాన్స్ కేక్ కటింగ్స్ తో ఎంత ఉత్సహంగా జరుపుకుంటారో.. అంతే ఉత్సాహంతో ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఈరోజు చిరు బర్త్ డే స్పెషల్ గా మెగా 158 టైటిల్ గ్లింప్స్ తో పాటుగా రిలీజ్ డేట్ ని దర్శకుడు కొల్లి బాబీ రిలీజ్ చేసారు. KVN ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న చిరు-బాబీ మెగా 158 చిత్ర టైటిల్ గా కాక ని ఫిక్స్ చేసారు.
సత్యం కేరెక్టర్ లో నుదిటిన బొట్టుతో సాఫ్ట్ గా కనిపించే సూపర్ వైజర్ పాత్రలో చిరు లుక్స్ కొత్తగా ఉన్నాయి. బైక్ కీస్ కోసం వాటర్ లోకి క్రెయిన్ ని దించుతూ చిరు ని పవర్ ఫుల్ గా బాబీ ఇంట్రడ్యూస్ చేసారు. టైటిల్ గ్లింప్స్ లో థమన్ BGM హైలెట్ గా నిలిచింది. ఇక కాక టైటిల్ గ్లింప్స్ తోనే ఈ చిత్రాన్ని సంక్రాంతికి అంటే జనవరి 13 న విడుదల చేస్తున్నట్టుగా డేట్ అనౌన్స్ చేసారు.
సత్యంగా సాఫ్ట్ గా కనిపించే చిరు కాక గా పవర్ ఫుల్ గా ఎలా మారుతారో అనే సస్పెన్స్ ని ఈ టైటిల్ గ్లింప్స్ క్రియేట్ చేసాయి. మరి మెగాస్టార్ కి సినీజోష్ టీమ్ తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే చిరు..!







































