21 కోట్లు అద్దెలు అందుకుంటున్న హీరో
Amitabh Bachchan's rental incomeబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపైనే కాదు.. వ్యాపార ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తూ తెలివైన పెట్టుబడులకు కొత్త అర్ధాన్ని చెబుతున్నారు. సినిమాల ద్వారా సంపాదించడమే కాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో బచ్చన్ కుటుంబం వేస్తున్న వ్యూహాత్మక అడుగులు వారి ఆస్తుల విలువను ఆకాశానంటిస్తున్నాయి. తాజాగా ముంబైలోని అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన కమర్షియల్ ప్రాపర్టీలోని మూడు ఫ్లోర్లను ట్రూ నేటివ్ F&B ప్ర.లిమిటెడె అనే న్యూట్రిషన్ సంస్థకు లీజుకు ఇవ్వడం ద్వారా బిగ్ బి సాధిస్తున్న రాబడి ప్రస్తుతం బిజినెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ భారీ లీజు ఒప్పందం ప్రకారం.. ప్రతినెల రూ. 33 లక్షల అద్దె అమితాబ్ ఖాతాలో జమకానుండగా.. ఐదేళ్ల కాలపరిమితికిగానూ మొత్తం లీజు విలువ సుమారు రూ. 21.88 కోట్లకు చేరుకుంది. సదరు కంపెనీ ఇప్పటికే రూ. 1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడమే కాకుండా.. ఏటా 5 శాతం అద్దె పెంపు నిబంధనకు .. 9 వాహనాల పార్కింగ్ వసతులకు అంగీకరించింది.
వయసుతో సంబంధం లేకుండా ఆర్థిక ప్రణాళికల్లో అమితాబ్ ప్రదర్శిస్తున్న ఈ చాకచక్యంపై సోషల్ మీడియాలో గొప్పగా స్పందిస్తుండగా.. నెటిజన్లు ఆయన బిజినెస్ మైండ్‌ను ప్రశంసిస్తున్నారు. గత ఏడాది అమితాబ్ ఆయన కుమారుడు అభిషేక్ కొన్ని అపార్ట్ మెంట్లను అమ్మడం ద్వారా 50కోట్లు పైగా కేవలం లాభాలు అర్జించడం ఆశ్చర్యపరిచింది. ముంబైలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో భారీ గా రియల్ వెంచర్లపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను ఆర్జిస్తున్నారు.








































