హిట్ టాక్ వస్తే ఆపలేరు
Irumudi vs Toxic
మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి చిత్రం ఈ నెల 21 న అంటే వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. రవితేజ కూడా దర్శకుడు శివ నిర్వాణ తో కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇరుముడి వచ్చిన ఐదు రోజులకే కన్నడ హీరో యశ్ నటించిన టాక్సిక్ విడుదల కాబోతుంది.
పాన్ ఇండియా మార్కెట్ లో యశ్ టాక్సిక్ పై అంచనాలున్నాయి. ఇరుముడి విడుదలైన ఐదు రోజులకే టాక్సిక్ రావడం అంటే రవితేజ ఇరుముడి పై ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. అయితే ఇరుముడి యునానమస్ గా హిట్ టాక్ తేగలిగితే గనక తెలుగులో టాక్సిక్ ప్రభావం కనిపించదు.
ఎలాగు టాక్సిక్ పెద్ద వాళ్లకు మాత్రమే అంటే ఏ సర్టిఫికెట్ చిత్రం. ఇక ఈ చిత్రంలో బోల్డ్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి టాక్సిక్ ఎక్కదు. సో రవితేజ ఇరుముడి కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే టాక్సిక్ వల్ల ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ప్రమాదం ఉండదు. లేదు అంటే టాక్సిక్ సునామీలో ఇరుముడి కొట్టుకుపోతుంది.







































